పున్నమి వెన్నెల వెలుగుల్లో పురివిప్పిందో నెమలి;
చల్లని గాలుల ఊసులతో ఊహలు ఉయ్యాలలూగె.
వెండిమబ్బుల చీర కట్టి పచ్చని పుడమి పులకరించె;
పూల పరిమళాల మత్తులో మనసు గమ్మత్తుగా గంతులేసె.
ఇసుకతిన్నెల నీడలలో జ్ఞాపకాలు దోబూచులాడె;
కృష్ణమ్మ అలలపై వెన్నెల ఎన్నో వన్నెచిన్నెలు పోయె.
మౌనమంతా మాటలై మల్లెల సువాసనలు వీచె;
ప్రకృతి ఒడిలో పరవశించి హృదయం ఈ గీతమాలపించె.
- రచన: M.Murali Mohan
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి