విశ్వంభర

విశ్వంభర


విశ్వంభర వీణా తంత్రుల  పై,
కాలమనే గీతాన్ని ఆలపించాను…
దిగ్దిగంతములు ఓంకార నాదాలతో నిండెలా…

భువనమోహన వేణువు పై,
వేదనాద స్వరాలు వినిపించాను…
ఈ విశ్వమంతా సమ్మోహనాస్త్రాలై కమ్ముకొనెలా…

కడలి ఒడిని  ఒడిసిపట్టి,
అంతరంగ తరంగాల చీకట్లు చిలికి చిలికి,
విరజిమ్మాను ఈ భువనమంతా రత్నగర్భ రాసులని…

అరుణగిరి సువర్ణరేఖల అంచులపై,
 సప్తాశ్వముల స్వర్ణరథం గూర్చి,
వీనిలాకాశమంత బంగారు కిరణాలతో నింపాను…

చంద్రచారికలను చేరి,
నిశ్శబ్ద నిశీథులను చీల్చి ,
చందనామృతాలు పంచాను లోకమంతా…

భువనైక మోహనమై,
సకల చరాచరుల   ప్రాణమై…
ఉచ్శ్వాస  నిశ్వాసల జీవమై…
జ్ఞానానంద  పరంజ్యోతి మయమై…  వెలుగొందు వేల్పునేను 

                                                  - ఎం. మురళీ మోహన్


జీవితం ఒక తులా త్రాసు



జీవితం ఒక తులా త్రాసు

జీవితం ఒక తులా త్రాసు;
బాధ్యతలు  బరువులు 

అందరూ సమంగా మోసినప్పుడే
అందరి జీవితం సుఖమయం అవుతుంది .

బరువు కానంత వరకు
సుఖమయమే  జీవితం.
బరువు అయిన మరుక్షణం —
బ్రతుకు చాలా భారమవుతుంది, బరువు అవుతుంది 

                                              --------ఎం.మురళీ మోహన్ 



వారసత్వం



వారసత్వం

వారసత్వం అంటే ఏమీ లేదు —
నీ తర్వాతి తరాలు
నిన్ను, నీ పూర్వీకులను
తీర్పు చేయటానికి వెతికే ఒక కారణం మాత్రమే.

నీవు ఆస్తి ఇస్తే —
“సరిపోలేదు” అంటారు.
ఇవ్వకపోతే —
“సంపాదించలేకపోయాడు” అంటారు.

సంపాదించి పెట్టినా
చాలని అనిపించదు;
సంపాదించకపోయినా
లోపమే అంటారు.

ఇస్తే ప్రశ్న,
ఇవ్వకపోతే మరింత ప్రశ్న —
తరాల తీర్పుకు
అంతం ఉండదు.

అందుకే —
వారసత్వం లేదని చింత వద్దు.
చింతలేని ,తర తరాలు తిట్ట లేని జీవితం — ముద్దు.

                                                    — murali mohan m


లక్ష్మీస్తుతి

  శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే ।                     శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...