Now the time has come
to delete every thing from your digital world
Else you will be fined on one way or the otherNow the time has come
to delete every thing from your digital world
Else you will be fined on one way or the otherసోనూసూద్ తో
పెనవేసుకున్న కథలన్నీ
మనసును కరిగించి కదిలించేవే
అందుకే భరతమాత ముద్దు బిడ్డ అయినాడు
అన్ని భస్మాసుర హస్తాలే
అది చైనా జింగుపింగ్ అయినా
అమెరికా డోనాల్డ్ ట్రంప్ అయినా
హింస లేకుండా
ఏ ఒక్క రోజూ గడపలేని మనస్తత్వం ఆవహించింది
నవ సమాజం కావాలంటే
హింసకు బహు దూరంగా అందరం జరగవలసి ఉంటుంది
ఎలెక్షన్స్ ఫ్రాడ్ కు
అమెరికా కూడా అతీతం కాలేక పోయిందా
జాతిఅహంకారాల మంటలు
అమెరికా పుర వీధులలో స్వైర విహారాలు చేస్తున్నాయి
భస్మాసుర హస్తాలే ఎక్కడ చూసినా తాండవం ఆడుతున్నాయి
భవిష్యత్తు పట్ల
జాగ్రత్త ఉండాలే కానీ
ఎటువంటి భయాలు ఉండరాదు
జాగ్రత్తకు భయానికి
తేడా తెలియక పోతే
ప్రతి ఒక అడుగు తడబడుతుంది
బ్రతుకే ఒక ప్రచ్ఛన్న యుద్ధమే అవుతుంది
- యం . మురళీ మోహన్
దేవుడు
మనిషికి విజ్ఞత యిచ్చాడు
విజ్ఞత మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చింది
విజ్ఞానము మనకు ప్రపంచాన్ని పరిచయం చేసింది
అయినాకూడా అక్కడక్కడా
ఇంకా మనిషి మూర్ఖపుజాడలు జాఢ్యాలు పోనేలేదు
ఏదో ఒక మిషతో తన అజ్ఞానాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తూనేవుంటాడు
సత్వర న్యాయం అంటే
వరంగల్ కోర్టు తీర్పు
సత్వర తీర్మానం సర్వత్రా హర్షణీయం ఆమోదయోగ్యం - జడ్జి గారు ఎంతో అభినందనీయులు
అద్దంలో చూసుకొని
మురిసే పోయే యెంకి
నాయుడు బావ రాకకై
ఎదురు చూపులాయే గుమ్మంలో
చీకట్లు చిక్కబట్టే ఇంకా చూపుకానడాయె
దీపాలు కొడిగట్టే ఊపిరులు బిగబెట్టే
ఎదురేల్లదామంటే తోడెవరులేకపోయే
పాపం ఎంకి
జారుకున్న నిదర్లోనూ ఎదురుచూపు పలవరింతలాయే
చాలు చాలు
ఇక గంగాధరా
అవి చిటపటచినుకుల
తొలకరులుకావు పుడమితల్లి పులకరింపగా
అంబరం అంబులవెల్లువడే శరసంధానవర్షములు
కారుమేఘాల జటాఝటముల నర్తనమాడే గంగమ్మ విలయ విశృంఖల పదనర్తనలు
శివమెత్తి రుద్ర తాండవంబాడేటి గంగమ్మను నీ శిగన ముడిగట్టి మడిన మలిగిపోయే జనుల బ్రోవుమా
ప్రతిరోజు
ఒకే ఉదయం అనిపిస్తే
బద్ధకం ఆవహించింది అని అర్థం
లేదా నిరాశ నిసృహలలో నిదరోతున్నావని అర్థం
ప్రతిరోజు ఒక కొత్త అన్వేషణతో ప్రారంభిస్తే
ప్రతి రోజులో కూడా కొత్త ఉదయం కనిపిస్తుంది - మనోవికాశం చాలా బాగా ఉంటుంది
దోగాడే పసివాళ్లే
బాల కృష్ణుని అవతారాలు
మూగ సైగలతో మురిపించే ప్రత్యక్ష దేవుళ్ళు
వారి సాంగత్యమే సాక్షాత్ భగవంతుని సాన్నిధ్యం
దొరకునా
అఖిలాండకోటి బ్రహ్మాదులకైనా
దొరకునా
అనంతకోటి పశుపక్ష్యాదులకైనా
ఒడిలోని పసికందు
చిన్నారి చేతులతో గోరుముద్దలు పెడితే
పరవశించిపోదా
నెరసిన తలలు తనువులు పారవశ్యంతో
ప్రతి రోజు
అద్దంలో
మనలని చూసుకొని ఎలా చక్క బరుచుకుంటామో
అలాగే ప్రతి రోజు
మనసులో
మనలని చూసుకొని మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి
చాలదా
నేనున్నాని తెలిపే ఒకే ఒక్క చక్కని సంకేతం
అర్జున రథసారథియై శ్రీకృష్ణుడు నిలిచినట్లు
వేలకొలది మాటల రాజకీయగారడీ చేష్టలేల
మౌనంగా చెప్పే ఒకే ఒక మనసు భాష చాలదా
పరమాత్ముడు
ప్రకటితమై మనలోనే ఉన్నాడు
సంశయమేల
పరిపరివిధముల ఈ పరుగులేల
ఆత్మశోధనమాని
అంధుని వోలె ఆమని అంతా కలియతిరిగినట్లు
అలా చూడు
ఆ అలలు
ఎలా నాగుపాములా ఎగసిపడుతూ
కడలికి నవజీవన ఊపిరులూదుతున్నాయో
విరిగిపడిన ప్రతిసారి
ఉరకలెత్తే ఉత్సహంతో
పరుగులుపెడుతూ తరంగ నాట్యం చేస్తూనేవున్నాయి
జీవితమనే సముద్రంలో కూడా
కోరికలనే కెరాటాలు
ఎల్లప్పుడు ఉవెత్తున లేస్తూ పడుతూనే ఉండాలి
క్రింద పడిన ప్రతిసారి
రెక్కలు బారున చాచి
దిగంతాలకు ఎగరలే తప్ప చచ్చానోరో అని చతికలపడరాదు
రాజకీయాలకు
సమీక్షా వేదికలకు
అతీతమైనవి ఏవి లేవా ?
కోర్టు వ్యాఖ్యలపై తీర్పులపై
భావోద్వేగాలను నియంత్రించుకోవలసిన
సమయం ఆసన్నమైనది !
కేంపులై పూచాయి
పాద పద్మములు
కాళిందునిపై తాండవంబాడి
అలసిపోయితివయ్యా
అఖిలాండ నాయకా
ఆదమరచి నిదురోరా ఆదిపురుషా
భ్రమనొంది భ్రమరాలు
మకరందమును గ్రోల
ఆదమరిచినవేళ ఝంకారములలేపే
మా దోషములుకావవి
మన్నించుమయ్యా మమ్ము
సర్వావస్థల సర్వవేళలా
పావురాయిలాంటి
హత్రాస్ గ్యాంగ్ రేప్ హత్యా - మానవ సమాజానికే అవమానకరం
రాక్షసులకు రక్షకభటుల సహకారం - అత్యంత హేయకరం లజ్జావిహీనకరం
ఇది సమాజరుగ్మతలకు పెద్ద నిదర్శనం - సవరించవలసిన సమయం ఆసన్నమైంది
మేఘ ఘర్జనలు
మెరుపు తీగలు
చిటపట చినుకులు
పుడమి తల్లి పలకరింపులు
అల్లరి చిరుగాలు
వృక్షపశుపక్ష్యాదుల ఒళ్ళుజలదరింపులు
కరోనా వికృతిలో కూడా
ప్రకృతి తన నృత్యం ఆపనే లేదు
అతీతంగామసలే ఒక్క మనం తప్ప
విమర్శ చేయని
స్వరమేలేదు
స్వరం స్వరంలో
సంగతులేలేవు
వాక్ స్వాతంత్య్రం అంటే ఇదేనేమో
రిక్తహస్తాల పిడికిళ్లలో
నిక్షిప్త శూన్యాలు దాచుకొని
ఏమి చూపగలరు ఈ ప్రపంచానికి
ఎంతకాలం చేయగలరు ఈ గారడీ రాజకీయ విద్య
ప్రభుత్వాలు మేలుకొనే సమయం ఎంతో దూరంలేదు
మనకు కావలసిన చాలా విషయాలు
మన కంటి ముందే మసలుతూ ఉంటాయి
ఓపికతో చూడలేక చాలా సంతోషాలు కోల్పోతూ ఉంటాం
పాటలకు ప్రాణం పోసిన గాత్రం
యెద లోతుల ఆర్ద్రత తీర్చిన గానం
సరిగమల స్వరాలతో
సీనీసంగీత సామ్రాజ్యమేలిన గాంధర్వం
ఇక సెలవా నేస్తం అంటూ
గగన సీమల కెగిరిపోయే మన బాలసుబ్రమణ్యం
ఆత్రుత భయం ముప్పిరి గొన్నప్పడు
ఆలోచనలకు అవకాశమే లేనపుడు
అంధకారమనే సుడిగుండంలో సుడులు తిరుగుతున్నప్పడు
మకరం బారిన పడిన కరిన్ బ్రోచినట్లు బ్రోచునుగదా ఆ గజేంద్ర వరదుడు
ఇది ఏమైనా
బాగా ఉందా
అంతర్వేది లో
రథానికి నిప్పు పెట్టటం
దుర్గమ్మ గుడిలో
వెండి సింహల తస్కరించటం
సాయిబాబా , అయ్యప్ప విగ్రహాలను
విఛ్చిన్నం చేయటం
శ్మశానం పక్కనే
పాఠశాల కట్టడం
సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలని ఇలా చేస్తున్నారు
వెకిలి చేష్టలతో మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారు
ఆలోచన ఎప్పుడూ
సమాధానాల వైపు పరుగులు తీయాలి
ఆందోళనల సుడిగుండాల వైపు కాదు
మా ఊరు యూత్
కులమతాలకు అతీతంగా
కష్టాలలో ఉన్నవారిని అందరిని
సహృదయంతో ఆదుకుంటున్నారు
చాల చక్కటి మార్పు - యెంతో స్ఫూర్తి దాయకం
అందుకే నేనంటాను
జనం జాగృతి అయింది అని
హక్కులే కాదు భాద్యతలు పంచుకొనే స్థితి
పిడికిలి బిగించి నినాదాలు చేయటం ఒక్కటే కాదు
సెలైంట్ గా ఆపదలోవున్నవారి ఆర్తి తీర్చటం వారిని హత్తుకోవటం అని
అడిగితే పోలా
అంతలా చేయాలా హెర్క్యులస్ ఫీట్స్
మహేష్ బాబు లా థంబ్సుప్ కోసం
పైగా నీకు తెలియదులే అనే డైలాగు కప్పిపుచ్చుకోటానికి
అందరూ చేసే ఈ చిన్న తప్పులే - అపార్థాలకు తావిస్తోంది
మూడ్ అనే పదం
తొలగించండి మీ డిక్షనరీ లోనుంచి
ఎందుకంటె
మూడ్స్ మధ్యలో వూగిసలాడేవారు
సమ న్యాయం చేయలేరు ఏ విషయంలోను కూడా
- అరుణామోహన్
అస్తిత్వాన్ని కోల్పోతున్నారు
వెండి తెర వేల్పులు
చిన్న పిల్లలకు టీనేజర్స్ కు
స్ఫూర్తి ప్రదాతలైనవారు
మత్తుకు బానిసై , వ్యసనాల బారిన పడి
ముందు తరాలకు యేమని మార్గదర్శనం చేస్తారు
నటనలో మీరు యెంత గొప్పవారు అయినా
వ్యక్తిగత నడకలో నడవడికలో సత్ప్రవర్తన లేకపోతే ఎలా ?
భావోద్వేగాలు దాటి ఆలోచిస్తేనే
వాస్తవికతను గుర్తించ కలుగుతాము
లేక పోతే కళ్ళు ఉన్నా కూడా కబోదులమే
మేధస్సు అనేది
నిదురించే విత్తనం లాంటిది
దానిని మేలుకొలిపితే
ఎలా శాఖోపశాఖలుగా విస్తరించి పూలు ఫలాలు ఇస్తుందో
మేలుకొన్న మేధస్సు కూడా
సహస్త్ర నాడీ చక్రాలను చైతన్య పరచి మహోన్నతుడిగా తీర్చి దిద్దుతుంది
మంచు పర్వతాలపై
మర ఫిరంగుల మోత
ప్రపంచ శాంతి చిహ్నాల
కబళింపుకు భయంకరమైన కుట్ర
దిగజారిన చైనా దురాగతానికి
ఇది పెద్ద నిదర్శనమై నిలుస్తుంది
వీధి పోరాటాలకు దిగజారి పోయిన చైనా
ఎర్ర జెండా గౌరవాన్ని మంటకలిపింది
ఈ కాల గమనంలో
తమతో తాము ఎల్లప్పుడు యుద్ధం చేసే వారు
తమ పరిసరాలలో నిరంతరం అభద్రతను పెంచే వారు
తమను తాము ఏదో ఒక సిద్ధాంతం చాటున ,ఏదో ఒక సైద్ధాంతికం మాటున మోము దాచుకున్నవారు
చిరునవ్వులతో ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని చక్కగా గడపడానికి లేని పోనీ బేషజాలు పోయేవారు
ఎప్పుడో ఒకప్పుడు తమకు తాము సారీ చెప్పుకొనే రోజు ఉంటుంది - కానీ కరిగిన కాలం తిరిగి రానేరాదుకదా
వేరొకరు అసూయా పడేలా
అందరు మనలని చూసి జాలిపడేలా
అందరిపైనా అధికారం చెలాయించేలా
నేనంటాను
సాధ్యమైనంత మందిని కలుపుకొని పోయేలా జీవించాలి అని
ప్రేమ పంచితే పెరుగుతుంది - లేదా దూరం దూరం పెరుగుతుంది
how to live
whether shall we live at the envy of others
whether shall we live at the mercy of others
whether shall we live always dominating the others
whether shall we live together with great hormony & peacefully
Probably I think that all shall together vote for the last line of stanza
______________________
తెల్లని పావురాల
రెక్కల సవ్వడిలో వినిపిస్తుంది మా శాంతి మంత్రం - సర్వే జనా సుఖినోభవంతు
పురివిప్పి నాట్యం చేసే మయూరాల
పింఛపు బిన్నవిభిన్న రంగులలో తెలుస్తుంది మా జీవన తత్త్వం - భిన్నత్వంలో ఏకత్వం
గంగ యమునా నర్మదా కావేరి కృష్ణ గోదావరి తుంగభద్ర
జీవనదుల గలగలలలో పొంగిపొర్లుతోంది మా జీవన స్రవంతి - సర్వ మత సమ్మేళనం
నిండుపున్నమి జాబిలిలా
చక్కదనానికే చక్కదనం అద్దినట్లు చూడ చక్కనమ్మగా సాగుతుంది - మా భారతీయం
ఎన్ని అమావాస్యలు వచ్చినా ఎన్ని గ్రహణాలు పట్టినా యెన్నటికి చెదిరిపోదు - మా ఐక్యమత్యం
ఓంకారం సడి - మా తెలుగు నుడి
సప్తస్వరాల ఝరీ తరంగాల సంగమమే మా తెలుగు పలుకు
కోకిలమ్మ కమ్మదనం , పుట్టతేనె తీయదనం , నిండుపున్నమి నిండుదనం
కలగలసిన నిరంతర జీవామృత ప్రవాహం మా చక్కని తేట తెలుగు సాహిత్యం
భానుప్రకాశ కిరణ శోభలలో అప్రతిహతమైన జిలుగు వెలుగులే మా తెలుగు తల్లి