తెల్లని పావురాల
రెక్కల సవ్వడిలో వినిపిస్తుంది మా శాంతి మంత్రం - సర్వే జనా సుఖినోభవంతు
పురివిప్పి నాట్యం చేసే మయూరాల
పింఛపు బిన్నవిభిన్న రంగులలో తెలుస్తుంది మా జీవన తత్త్వం - భిన్నత్వంలో ఏకత్వం
గంగ యమునా నర్మదా కావేరి కృష్ణ గోదావరి తుంగభద్ర
జీవనదుల గలగలలలో పొంగిపొర్లుతోంది మా జీవన స్రవంతి - సర్వ మత సమ్మేళనం
నిండుపున్నమి జాబిలిలా
చక్కదనానికే చక్కదనం అద్దినట్లు చూడ చక్కనమ్మగా సాగుతుంది - మా భారతీయం
ఎన్ని అమావాస్యలు వచ్చినా ఎన్ని గ్రహణాలు పట్టినా యెన్నటికి చెదిరిపోదు - మా ఐక్యమత్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి