27, ఆగస్టు 2020, గురువారం

జనం జాగృతమై ఉన్నారు



నేను చూస్తున్నా

ఈ రాజకీయ చక్రంలో

ఇరుకైనా మనస్తత్వాలతో

ఇరుసుల మధ్య తిరిగే పార్టీలను

స్వార్థాల నడుమ సాగే రాజకీయాలలో 

స్వచ్చ్చమైన స్వేఛ్చా వాయువులకు తావెక్కడ

ఎవరి గొంతులోను కనిపించని  వినిపించని  నిజాయితీ

అన్ని గొంతుల వెనక ఏవేవో గూడార్థాలే  రహస్య లెక్కల పట్టికెలే

అందుకే నమ్మలేక పోతున్నారు విశ్వసనీయత ఉంచలేక పోతున్నారు

జనం జాగృతమై ఉన్నారు కనిపించని నివురులా - తగ్గించుకోండి దుర్భాషలను,దుష్కృత్యాలనూ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పరమేశ్వరా !

పరమేశ్వరా ! ఎదుట ఉన్నా —  కనలేని కన్నులు,   పిలుస్తున్నా  —  వినలేని చెవులు.   సాక్షాత్  ముందు నిలబడి ఉన్నా —   కైమోడ్చి మోకరిల్లలేని  మూఢత్...