यो भूतानां नयनसलिलं गाङ्गरूपं जटासु
कण्ठे धत्ते जगदुरुभयं कालकूटात्मरूपम् ।
नित्यं स्नात्वा सकलकलुषं भस्मना सन्धुनोति
शर्वं वन्दे भजकदुरितं कृत्तिवासं वहन्तम् ॥
యో భూతానాం నయనసలిలం గాంగరూపం జటాసు
కంఠే ధత్తే జగదురుభయం కాలకూటాత్మరూపమ్ |
నిత్యం స్నాత్వా సకలకలుషం భస్మనా సంధునోతి
శర్వం వందే భజకదురితం కృత్తివాసం వహంతమ్ ||
తాత్పర్యం
ఎవరు సర్వప్రాణుల కన్నీటిని గంగారూపంలో జటాజూటమున ధరిస్తారో, జగత్తుకు కలిగే మహాభయాన్ని కాలకూట విషరూపంలో కంఠమున ధరిస్తారో, నిత్యం భస్మస్నానంతో సకల పాపాలను కడిగివేస్తారో, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించి భక్తుల పాపభారాన్ని వహిస్తారో, ఆ శర్వునికి నమస్కరిస్తున్నాను.
M.Murali Mohan
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి