పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

కరోనా వికృతి

  మేఘ ఘర్జనలు                        మెరుపు తీగలు  చిటపట చినుకులు                     పుడమి తల్లి పలకరింపులు  అల్లరి చిరుగాలు                      వృక్షపశుపక్ష్యాదుల ఒళ్ళుజలదరింపులు  కరోనా వికృతిలో కూడా                    ప్రకృతి  తన నృత్యం ఆపనే లేదు                                                     అతీతంగామసలే ఒక్క మనం తప్ప 

వాక్ స్వాతంత్య్రం అంటే ఇదేనేమో

విమర్శ చేయని                        స్వరమేలేదు  స్వరం స్వరంలో                       సంగతులేలేవు  వాక్ స్వాతంత్య్రం అంటే ఇదేనేమో                                          

ఎంతో దూరంలేదు

  రిక్తహస్తాల పిడికిళ్లలో  నిక్షిప్త శూన్యాలు దాచుకొని  ఏమి చూపగలరు ఈ   ప్రపంచానికి ఎంతకాలం చేయగలరు ఈ గారడీ రాజకీయ విద్య  ప్రభుత్వాలు మేలుకొనే  సమయం ఎంతో  దూరంలేదు 

ఓపికతో చూడలేక

మనకు కావలసిన చాలా విషయాలు  మన కంటి ముందే మసలుతూ ఉంటాయి  ఓపికతో చూడలేక చాలా సంతోషాలు కోల్పోతూ ఉంటాం 

బోలెడంత భేదం

పసుపు తాడుకు  పచ్చ తాడుకు బోలెడంత భేదం  ఒకటి మంగళ కరమైనది రెండవది సాధారణమైనది 

మన బాలసుబ్రమణ్యం

 పాటలకు ప్రాణం పోసిన గాత్రం               యెద లోతుల ఆర్ద్రత తీర్చిన  గానం  సరిగమల స్వరాలతో               సీనీసంగీత సామ్రాజ్యమేలిన గాంధర్వం  ఇక సెలవా నేస్తం అంటూ                     గగన సీమల కెగిరిపోయే  మన బాలసుబ్రమణ్యం 

గజేంద్ర వరదుడు

  ఆత్రుత భయం ముప్పిరి గొన్నప్పడు  ఆలోచనలకు అవకాశమే లేనపుడు  అంధకారమనే సుడిగుండంలో సుడులు తిరుగుతున్నప్పడు   మకరం  బారిన పడిన కరిన్  బ్రోచినట్లు బ్రోచునుగదా ఆ గజేంద్ర  వరదుడు 

వెకిలి చేష్టలతో

  ఇది ఏమైనా                   బాగా ఉందా  అంతర్వేది లో               రథానికి నిప్పు పెట్టటం  దుర్గమ్మ గుడిలో                    వెండి సింహల తస్కరించటం  సాయిబాబా , అయ్యప్ప విగ్రహాలను                                      విఛ్చిన్నం చేయటం  శ్మశానం పక్కనే                            పాఠశాల  కట్టడం  సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలని ఇలా చేస్తున్నారు                              వెకిలి చేష్టలతో మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారు 

ఆందోళనల సుడిగుండాల వైపు కాదు

ఆలోచన ఎప్పుడూ                   సమాధానాల  వైపు పరుగులు తీయాలి                                           ఆందోళనల సుడిగుండాల వైపు  కాదు 

ఆర్తి తీర్చటం అని

   మా ఊరు యూత్  కులమతాలకు అతీతంగా  కష్టాలలో ఉన్నవారిని అందరిని  సహృదయంతో ఆదుకుంటున్నారు  చాల చక్కటి మార్పు - యెంతో స్ఫూర్తి దాయకం   అందుకే నేనంటాను  జనం జాగృతి అయింది అని   హక్కులే కాదు భాద్యతలు పంచుకొనే స్థితి  పిడికిలి బిగించి నినాదాలు చేయటం ఒక్కటే  కాదు  సెలైంట్ గా  ఆపదలోవున్నవారి ఆర్తి తీర్చటం వారిని హత్తుకోవటం అని 

అపార్థాలకు తావిస్తోంది

  అడిగితే పోలా  అంతలా చేయాలా హెర్క్యులస్   ఫీట్స్ మహేష్ బాబు లా థంబ్సుప్ కోసం  పైగా నీకు తెలియదులే అనే డైలాగు కప్పిపుచ్చుకోటానికి  అందరూ చేసే ఈ  చిన్న తప్పులే - అపార్థాలకు తావిస్తోంది 

మూడ్

  మూడ్ అనే పదం  తొలగించండి మీ డిక్షనరీ లోనుంచి  ఎందుకంటె  మూడ్స్ మధ్యలో వూగిసలాడేవారు  సమ న్యాయం  చేయలేరు ఏ విషయంలోను కూడా                                           - అరుణామోహన్ 

సత్ప్రవర్తన లేకపోతే ఎలా

  అస్తిత్వాన్ని   కోల్పోతున్నారు                                      వెండి తెర వేల్పులు  చిన్న పిల్లలకు  టీనేజర్స్ కు                                    స్ఫూర్తి  ప్రదాతలైనవారు  మత్తుకు బానిసై , వ్యసనాల బారిన పడి                                     ముందు తరాలకు యేమని మార్గదర్శనం చేస్తారు  నటనలో మీరు యెంత గొప్పవారు  అయినా                                        వ్యక్తిగత  నడకలో నడవడికలో సత్ప్రవర్తన లేకపోతే ఎలా ?

కబోదులమే

భావోద్వేగాలు దాటి ఆలోచిస్తేనే  వాస్తవికతను గుర్తించ కలుగుతాము  లేక పోతే కళ్ళు ఉన్నా  కూడా కబోదులమే 

వింతపోకడలు

నేను చూస్తున్నా               చదువుకున్న వాళ్లు                                   చాలా గొప్ప వాళ్లు  తమ గురించి             తాము తెలుసుకోవటానికి                                ఎక్కడెక్కడికో పోతున్నారు   సాధువులంటారు                  సద్గురువులు అంటారు                                       పౌండ్రక వాసుదేవుళ్లు అంటారు  తమకు తెలియదా                   తామూ  ఒక జీవులమని                                      జ్ణాన విషక్షణాదులు కలి...

మహోన్నతుడిగా తీర్చి దిద్దుతుంది

  మేధస్సు  అనేది                  నిదురించే విత్తనం లాంటిది  దానిని మేలుకొలిపితే                  ఎలా శాఖోపశాఖలుగా విస్తరించి పూలు ఫలాలు ఇస్తుందో  మేలుకొన్న మేధస్సు కూడా                       సహస్త్ర నాడీ చక్రాలను చైతన్య పరచి మహోన్నతుడిగా  తీర్చి దిద్దుతుంది 

యెర్ర జండా గౌరవం ?

  మంచు పర్వతాలపై                                మర ఫిరంగుల మోత  ప్రపంచ శాంతి చిహ్నాల                               కబళింపుకు  భయంకరమైన కుట్ర  దిగజారిన చైనా దురాగతానికి                                      ఇది పెద్ద  నిదర్శనమై నిలుస్తుంది  వీధి పోరాటాలకు  దిగజారి పోయిన చైనా                                           ఎర్ర జెండా గౌరవాన్ని మంటకలిపింది 

నీవు పంచభూతానివే

నీతో నీకు యుద్ధమేల  నీ చుట్టూ అభద్రత పరచనేల  లేనిపోని బేషజాలా చట్రములేల   జీవితాన్ని  జీవించు చక్కగా లభించినట్లు  నింగి నేలా గాలి నీరు నిప్పుల యొక్క  సాక్షిగా  నీవు పంచభూతానివే  కలిసిపోక తప్పదు పుడమిలోన 

సారీ చెప్పుకొనే రోజు

 ఈ కాల గమనంలో  తమతో తాము ఎల్లప్పుడు యుద్ధం చేసే వారు  తమ పరిసరాలలో నిరంతరం అభద్రతను పెంచే వారు   తమను తాము ఏదో ఒక సిద్ధాంతం చాటున ,ఏదో  ఒక సైద్ధాంతికం మాటున మోము దాచుకున్నవారు   చిరునవ్వులతో ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని చక్కగా గడపడానికి లేని పోనీ బేషజాలు పోయేవారు  ఎప్పుడో ఒకప్పుడు తమకు తాము సారీ చెప్పుకొనే రోజు ఉంటుంది  - కానీ కరిగిన కాలం తిరిగి రానేరాదుకదా     

ఎలా జీవించాలి ?

వేరొకరు అసూయా పడేలా    అందరు మనలని చూసి జాలిపడేలా   అందరిపైనా అధికారం చెలాయించేలా నేనంటాను  సాధ్యమైనంత  మందిని  కలుపుకొని పోయేలా జీవించాలి అని  ప్రేమ పంచితే పెరుగుతుంది - లేదా దూరం దూరం పెరుగుతుంది 

how to live

  how to live whether shall we live at the envy of others whether shall we live at the mercy of others whether shall we live always dominating the others whether shall we live together with great hormony & peacefully Probably I think that all shall together vote for the last line of stanza                    ______________________

మా భారతీయం

తెల్లని పావురాల   రెక్కల సవ్వడిలో  వినిపిస్తుంది మా  శాంతి మంత్రం - సర్వే జనా సుఖినోభవంతు  పురివిప్పి నాట్యం చేసే మయూరాల  పింఛపు  బిన్నవిభిన్న రంగులలో  తెలుస్తుంది మా  జీవన తత్త్వం - భిన్నత్వంలో ఏకత్వం  గంగ యమునా నర్మదా కావేరి కృష్ణ గోదావరి  తుంగభద్ర జీవనదుల గలగలలలో పొంగిపొర్లుతోంది  మా జీవన స్రవంతి   - సర్వ మత సమ్మేళనం  నిండుపున్నమి జాబిలిలా  చక్కదనానికే చక్కదనం  అద్దినట్లు చూడ చక్కనమ్మగా సాగుతుంది  - మా భారతీయం  ఎన్ని  అమావాస్యలు వచ్చినా ఎన్ని గ్రహణాలు పట్టినా యెన్నటికి చెదిరిపోదు - మా ఐక్యమత్యం 

మా తెలుగు బాష

ఓంకారం  సడి - మా తెలుగు నుడి సప్తస్వరాల ఝరీ  తరంగాల సంగమమే మా తెలుగు పలుకు   కోకిలమ్మ కమ్మదనం , పుట్టతేనె తీయదనం , నిండుపున్నమి నిండుదనం  కలగలసిన నిరంతర  జీవామృత  ప్రవాహం మా చక్కని తేట తెలుగు సాహిత్యం  భానుప్రకాశ కిరణ శోభలలో అప్రతిహతమైన  జిలుగు వెలుగులే  మా తెలుగు తల్లి   

ఒక ప్రశ్నార్థకమే

ఒక ప్రశ్నార్థకమే  ఒకరి తరువాత ఒకరుగా  పెద్దల తరం  కాలగర్భంలో కలిసిపోతున్నారు    వారు మనపై పంచిన  మమకారాలు ప్రేమలు మాత్రం మిగిలాయి జ్ఞాపకాలలో  అటు ఇటు కానీ తరం మనది  ఏమాత్రం చేయగలం న్యాయం మన ముందు తరాలకు ఒక ప్రశ్నార్థకమే