॥ శ్రీ అలివేలు మంగమ్మ స్తుతి ॥
అమ్మా మాయమ్మా! అలివేలు మంగమ్మా!
లాలించి పాలించి, మమ్ము చల్లగా చూడమ్మా.
కన్నతల్లివి నీవే, గురువూ దైవమూ నీవే,
మా అయ్య వేంకన్న ముద్దుల ప్రియసఖి నీవే॥
ఏడుకొండలపైన రేయి వెన్నెల వేళ,
కురిసెను నీ చిరునవ్వుల వెండి వెన్నెల జాల.
చింతలకు రెక్కలొచ్చె, చిటికెలో ఎగిరిపోయె,
బ్రతుకులన్నీ వెలిగె బంగారు కాంతులలో॥
M. Murali Mohan
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి