॥ శ్రీ దశావతార స్తవం ॥
మురళీమోహన విరచితం — సంస్కృతం తెలుగు లిపిలో
౧. మత్స్యావతారం 🐟
[ మూల శ్లోకం ]
జలాంబుధి గర్భగతం నిగమనిధిం హయగ్రీవాసురహృతం సముద్ధృతం |
వేదోద్ధృత! ధర్మోద్ధృత! మత్స్యావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
సముద్రగర్భమున మునిగిన వేదనిధిని హయగ్రీవాసురుని నుండి ఉద్ధరించినావు |
వేదముల కాపాడినవాడా! ధర్మమునుద్ధరించినవాడా! మత్స్యావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౨. కూర్మావతారం 🐢
[ మూల శ్లోకం ]
దేవాసురాబ్ధిమథనే నిమగ్నమందరాచలం |
క్షీరసాగరసంభూతమమృతం యః సముజ్జహార ||
అమృతోద్ధృత! దేవోద్ధృత! కూర్మావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
దేవదానవుల అమృతమథనమున మునిగిన మందరపర్వతమును మోసినావు |
క్షీరసాగరమునుండి అమృతమెత్తి దేవతలను కాపాడినావు |
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౩. వరాహావతారం 🐗
[ మూల శ్లోకం ]
రసాతలగతాం ధరణీం హిరణ్యాక్షహృతాం |
దంష్ట్రాగ్రసముద్ధృతాం దధార యః వరాహవపుః ||
భూద్ధృత! ధర్మోద్ధృత! వరాహావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
రసాతలమున హిరణ్యాక్షుడు దాచిన భూమిని వరాహరూపమున దంష్ట్రలపై ధరించి ఉద్ధరించినావు |
భూమిని కాపాడినవాడా! ధర్మమునుద్ధరించినవాడా! వరాహావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౪. నృసింహావతారం 🦁
[ మూల శ్లోకం ]
సంధ్యాకాలే ద్వారదేశే స్తంభోద్భవం హరిం |
హిరణ్యకశిపుం నఖాగ్రైర్విదదార యః ||
ప్రహ్లాదోద్ధృత! దీనజనోద్ధృత! నృసింహావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
సంధ్యాకాలమున స్తంభమునుండి వెలువడి హిరణ్యకశిపుని నఖాగ్రాలతో చీల్చినావు |
ప్రహ్లాదుని కాపాడినవాడా! దీనులనుద్ధరించినవాడా! నృసింహావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౫. వామనావతారం 👣
[ మూల శ్లోకం ]
బలియజ్ఞమండపే బాలబ్రహ్మచారిణం |
త్రివిక్రమపదైర్లోకత్రయం వ్యమాప యః ||
బల్యుద్ధృత! లోకోద్ధృత! వామనావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
బలిమహారాజు యజ్ఞమండపమున బాలబ్రహ్మచారివై వేంచేసి త్రివిక్రమ పదాలతో ముల్లోకాలు కొలిచినావు |
బలిని అదుపులో ఉంచినవాడా! లోకాలనుద్ధరించినవాడా! వామనావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౬. పరశురామావతారం 🪓
[ మూల శ్లోకం ]
కామధేనుహృతాటోపం జమదగ్నివధాతురం |
ఏకవింశతివారక్షత్రాన్ పరశునా న్యపాతయద్ యః ||
పితృరక్షోద్ధృత! భృగువంశోద్ధృత! పరశురామావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
కామధేనువును అపహరించి జమదగ్నిని వధించిన క్షత్రియులను పరశువుతో నాశనము చేసినావు |
పితరులను రక్షించినవాడా! భృగువంశమునుద్ధరించినవాడా! పరశురామావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౭. శ్రీరామావతారం 🏹
[ మూల శ్లోకం ]
శైవచాపప్రభంగాప్త జానకీప్రాణనాయకం |
పౌలస్త్యరావణేంద్రస్య సంహారం యశ్చకార హ ||
శరణాగతోద్ధృత! ధర్మోద్ధృత! శ్రీరామావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
శివధనుస్సు విరిచి జానకీదేవిని వరించి రావణాసురుని సంహరించినావు |
శరణాగతులనుద్ధరించినవాడా! ధర్మమును నిలిపినవాడా! శ్రీరామావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౮. శ్రీకృష్ణావతారం 🪈
[ మూల శ్లోకం ]
కురుక్షేత్రే రథస్థం తం గీతామృతవిధాయకం |
విశ్వరూపప్రదర్శేన మోహజాలం జహార హ ||
పార్థోద్ధృత! విశ్వోద్ధృత! శ్రీకృష్ణావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
కురుక్షేత్ర రణరంగమున రథముపై నిలిచి గీతామృతమొసగినావు |
విశ్వరూపము చూపి అర్జునుని మోహమడఁచినావు |
పార్థుని ఉద్ధరించినవాడా! విశ్వమును కాపాడినవాడా! శ్రీకృష్ణావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౯. బుద్ధావతారం 🧘
[ మూల శ్లోకం ]
బోధిమూలే స్థితం శాంతం జ్ఞానదీపప్రకాశకం |
అవిద్యామోహజాలస్య ఛేత్తారం యో బభూవ హ ||
కరుణోద్ధృత! లోకోద్ధృత! బుద్ధావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
బోధివృక్షమూలమున శాంతముగా జ్ఞానదీపమై వెలిగినావు |
అవిద్యా మోహజాలమును ఛేదించి లోకమెల్ల జ్ఞానోదయమొసగినావు |
కరుణతో లోకమునుద్ధరించినవాడా! బుద్ధావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౧౦. కల్క్యవతారం ⚔️
[ మూల శ్లోకం ]
కలికాలసముద్భూత మధర్మతిమిరావృతం |
దేవదత్తహయారూఢం ఖడ్గపాణిం యమాగమత్ ||
కలిదోషోద్ధృత! ధర్మోద్ధృత! కల్క్యవతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
[ భావార్థం ]
కలికాలమున అధర్మాంధకారము వ్యాపించినప్పుడు |
దేవదత్తాశ్వమునెక్కి ఖడ్గపాణివై దిగివచ్చెదవు |
కలిదోషమడఁచువాడా! ధర్మమునుద్ధరించువాడా! కల్క్యవతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
॥ ఫలశ్రుతి ॥
దశావతారస్తవమిదం మురళీమోహనేన కృతం |
యః పఠేత్ భక్తిభావేన విష్ణోః సాయుజ్యమాప్నుయాత్ ॥
మురళీమోహనుడు రచించిన ఈ దశావతార స్తవమును భక్తిభావముతో పఠించినవారు విష్ణుసాయుజ్యమును పొందెదరు ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి