భుజంగ-జటాజూట-ధర, అనంగ-మేఖల రుద్రాక్ష-మాల్యాధర | నఖశిఖ-పర్యంత-విభూతి-భస్మధర, హిమశృంగ-బాలేందు-చంద్రకళాధర || భ్రూచాప-స్ఫులింగ-లలాటధర, విద్యుత్స్మిత-రుచిర-త్రిశూలధర | కాలకరాళ-విషకుంభ-కంఠధర, కాలకాలాగ్ని-త్రినేత్రధర గంగాధర || ప్రళయకాల-పదఘట్ట-రుద్రతాండవధర, ఉచ్ఛ్వాస-నిశ్శ్వాస-ప్రాణశక్తిధార హర ||
డమడమత్-డమరుక-నాదధర, ధిమిధిమిత్-తకధిమి-నృత్యధర | అండ-పిండ-బ్రహ్మాండ-గర్భధర, ధిక్-దిగంత-ధిక్పాలధర || ఝణత్-ఝణుత-శివతాండవధర, ఘణత్-ఘణిత-జ్వాలాజాలధర | ఘూర్ణిత-సకల-చరాచర-విశ్వధర, సచ్చిదానంద-శివ-తాండవధర ||
జ్వలజ్వలిత్-లోచన-కామభస్మధర, ధగధగత్-ఫాలలోచన-పావకధర | యుగాంత-కాల-భైరవ-రూపధర, సకల-తిమిర-సంహార-తేజోధర || మాయా-విస్మృతి-భంగధర, గుణత్రయ-అతీత-జ్ఞానధర | కాలాతీత-కారణ-కార్యధర, నిత్య-యోగానంద-రూపధర ||
- Murali Mohan .M.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి