31, డిసెంబర్ 2013, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు



మీకు 

మీ ప్రియమైన కుటుంబ సభ్యులకు  

మీ అందరికి  

మా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు 

                                                    మీ 
                                           advocatemmmohan

28, డిసెంబర్ 2013, శనివారం

బిందువు



చెలియల కట్ట నుంచి 

ఒక్కొక్క బిందువు జారిపోతుంది 

ఆత్మీయుల అంతర్ధానములో ఆవిరై 

జననం తరువాత మరణం అని తెలిసినా 

( రాధమ్మ గారి జ్ఞాపకార్థం )

27, డిసెంబర్ 2013, శుక్రవారం

భస్మీపటలం



జనాలనే కాష్టలను  పేర్చి 

ప్రాంతీయ భేధాలనే మంట రగిల్చి 

వెచ్చ వెచ్చ గా చలి కాగుతున్నారు 

చలి మంట కాస్తా పెనుమంట గా మారి 

మిమ్ములనందరినీ భస్మీపటలం చేస్తుంది - జాగ్రత్త 

25, డిసెంబర్ 2013, బుధవారం

23, డిసెంబర్ 2013, సోమవారం

కాళహస్తిశ్వరా




సామెతలను నిజం చేస్తూ 

ఏమిటయ్యా ఈ నీ లీలలు 

మింగేవాడివి నీవే మింగించే వాడివి నీవే 

మా తప్పు ఏమి లేదయ్యా కాళహస్తిశ్వరా ! అంటారు !!

16, డిసెంబర్ 2013, సోమవారం

పోరాడే వాడికి ఓటమి లేదు



దేశ భక్తి 

వృత్తి లో ప్రాణాలు 

కోల్పోయిన  శ్రీధర్ , కరుణాకర్ 

రూపంలో నిలువెత్తున నిలిచింది 

వారికి అందరం చేతులెత్తి సలాం చేయాలి 

పోరాడే వాడికి ఓటమి లేదు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు 

( స్మగ్లర్ల దాడి లో అశువులు బాసిన ఫారెస్ట్ అధికారులకు ఘన నివాళి )

14, డిసెంబర్ 2013, శనివారం

ప్రయోజనకరంగా మార్చుకో



ఎవరు చెప్పారు 

కనులు తెరిస్తే జననం అని 


కనులు మూస్తే మరణం అని 


క్షణకాలం ఈ జీవితం అని 


ఎన్ని కోట్ల అడుగులు నడవాలి 


ఎన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేయాలి 


ఎనేన్ని దశల దాటి దశాబ్దాల తరబడి సాగాలి 


ఎన్నెన్నో పున్నమలు , ఎన్నో అమావాస్యలు చూడాలి 


ఇంత గొప్ప ప్రయాణాన్ని యెంతో ప్రయోజనకరంగా మార్చుకో..... !!

10, డిసెంబర్ 2013, మంగళవారం

పరిష్వంగం



రుద్ర భూమి

ఇచ్చోటనే కదా పెద్దలు విశ్రమించేది

ఇచ్చోటనే కదా బాధ్యతల బరువు తెగేది

ఇచ్చోటనే కదా అవిశ్రాంత విశ్రాంతి దొరికేది

ఇచ్చోటనే కదా ప్రధమ గణనాధులు తిరిగేది

ఎందుకు వెరపు ఈ వైపు కన్నేతి  చూడటానికి

ఆపై ఎలాగు కన్నులు తెరిచి చూడలేవు ఈ సుందర దృశ్యం

అగ్ని తన పరిష్వంగంతో మన దేహాలను పరమ పవిత్రం చేసే ... 

7, డిసెంబర్ 2013, శనివారం

నెల్సన్ మండేలా

బేడీలు 

నను బంధిచాయి ప్రజల హృదయాలతో 



చెరసాలలు 

అయ్యాయి బారసాలలు నా దేశం ప్రేమలో  

గాంధీ స్పూర్తి పోసింది అహింస ఊపిరి యెదలో 

పిడికిలి బిగించాను జాతి వివక్షపై తిరుగులేని పోరాటం 

నేను ,నెల్సన్ మండేలాను - ఎర్రగా మండే నల్ల జాతి సూర్యుడిని 

భారత రత్నతో ఘన నివాళి మా దత్త పుత్రునికి - నెల్సన్ మండేలాకు 


6, డిసెంబర్ 2013, శుక్రవారం

అగ్ని కీలలలో



తాత వయస్సుకు కూడా 

అంటుకుంటున్నాయి మరకలు 

నిజానిజాలు అంతరంగాలకు ఎరుక 

అగ్ని కీలలలో  నిలుచుంది  నీతి - న్యాయం 


4, డిసెంబర్ 2013, బుధవారం

ప్రజలను విస్మరిస్తున్నారు



కాంగ్రెస్ - తప్పటడుగులు 

చెవి మాటలకు తల ఉపేవాడు 

రానే రాడు సరియైన నిర్ణయానికి 

ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అందరూ ప్రజలను విస్మరిస్తున్నారు