బద్దెన
*సుమతీ శతకం - బద్దెన*
*1.*
శ్రీరాముని దయ చేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ!
*2.*
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు సత్యము సుమతీ!
*3.*
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!
*4.*
ఎప్పుడు పడిన అప్పుడే
చప్పున లేచి యొడ లెరుగక చనుదెంచును
తప్పెట గుద్దిన యట్లగు
రొప్పెడు పలుకులు సభలను రోతలు సుమతీ!
*5.*
కలిమిగల లోభి కన్నను
విలువ గలిగిన దాత గొప్ప విశ్వంబుననున్
చలి చీమ కన్న ఘనమగు
నిలువెల్ల విషంబు గల్గు నీలపు సుమతీ!
*6.*
చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక లేక యుండినన్
జదువు నిరర్థకంబు గుణ సంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటన్
మదుర ఫలంబు లుండి రుచిమాలిన జంబుక భక్ష్యముల్ గదా
వదలక కాకరేపు చవి వచ్చునె యమృతంబు గల్గినన్ సుమతీ!
*7.*
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
*8.*
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబున కగు తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథము సుమతీ!
*9.*
ఇమ్ముగ జదువని నోరును
అమ్మా యని పిలిచి అన్నమడుగని నోరున్
దమ్ములగోరని నోరును
కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
*10.*
ఉపకారికి ఉపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
*11.*
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
*12.*
తనువున విరోధి బాధలు
మనమున చింతలును గలుగ మనుజుడు గృశియై
అనుదిన మాయువు దరిగియు
జననీ జఠరంబు జొరడు జగతిని సుమతీ!
*13.*
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!
*14.*
మాటలు కోటలు దాటును
మాటలు మన్నించి పొగడు మాన్యుల జగతిన్
మాటలు చేటును దెచ్చును
మాటలు కాపాడు గాన మహిలో సుమతీ!
*15.*
వెలయాలు సేయు వలపును
పులి తోలు గప్పుకొన్న పోతును వలెనౌ
తలపకుము నిజము గాదది
వెలలేని గుణంబు గలదె వినరా సుమతీ!
*16.*
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు ఏరును ద్విజుడున్
చొప్పడిన యూరునుండుము
చొప్పడకనుయున్న యూరు చొరకుము సుమతీ!
*17.*
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ!
*18.*
కారణము లేక దూషించు
కారణము లేక పొగడు కార్యము ఏలా
కారణము లేక వచ్చును
మారణ మంతయు నిజంబు మహిలో సుమతీ!
*19.*
నీరు పల్లమెఱిగి పారు
నిజమైన కోడె త్రాచు నిలువున బడును
ఊరక సజ్జనుడైనను
నోరు మెదపక యూరకుండు నొప్పుగ సుమతీ!
*20.*
తన వారు లేనిచోటను
జన విదితము కాని చోట జగడము వలదు
అనువుగాని చోటను
మనసున చింతింప వలదు మహిలో సుమతీ!
---
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి