పోస్ట్‌లు

2014లోని పోస్ట్‌లను చూపుతోంది

నిర్లక్ష్యం ఖరీదు

చిత్రం
ఒక నిర్లక్ష్యం ఖరీదు ఇరవై ఇదు నిండు ప్రాణాలు చిరు ప్రాయాలు నీటి ఒరవడి  పాలు Himachal tragedy: HC says it's case of negligence

మిగిలేది జ్ఞాపకాలే

చిత్రం
కాలం మన వయస్సును మన యవ్వన్నాని మనకు తెలియకుండా దొంగలిస్తుంది కాని మన జ్ఞాపకాలను మాత్రం చెదరగోట్టలేదు చివరి దశలో మనతో వచ్చేది మనకు మిగిలేది జ్ఞాపకాలే 

ప్రశాంతంగా

చిత్రం
రేపు అనేది ఉండగా  ఎందుకు చింత నీకు దండగ  రానీ  వయస్సు  కరగనీ  కాలం పోయేది ఏముంది  ఉభయ సంధ్యల నడుమ  నలిగిపోతుంది దేహం శ్రమతో  రాత్రి అనే దుప్పటి కప్పి పోనీయి నిదుర ప్రశాంతంగా 

భీష్ముని పాత్ర

చిత్రం
జీవిత  చదరంగలో  ప్రతివారు  తమ జీవితంలో  ఎప్పుడో ఒక్కప్పుడు  భీష్ముని పాత్ర వేయవలసిందే  మన మన్మోహన్ సింగు ఒక లెక్క కాదు 

సీతారామ కళ్యాణం

చిత్రం
ఆకాశం రాముడైతే  కాదా సీతమ్మ భూదేవి  సూరీడే నుదిటి కుంకుమ బొట్టైతే  కాదా చందమామ సిరివెన్నెలలొకె నగు మోము  నడిరేయీ పరుచుకున్న  కురులైతే  కరి మబ్బులు అలరారలేదా ముంగురులై  తారల పూలను సిగలో తురిమి  పున్నమి వెన్నలలు యెదలో  పొదిగి  పాలపుంతల పై  నడిచి వచ్చే వధువు  సీతమ్మ - వరుని రామునికై  చూతము రండి  సీతారామ కళ్యాణం కన్నుల నిండుగా మనసుల మెండుగా 

వెతకండి

అబ్బా !బాబు ! అన్నీ పార్టీల నాయకులు  మన పార్టీలో చేరిపోయారు  ఇక పార్టి జండా మోసుకొని పోయేవాళ్ళ కావాలి - వెతకండి 

పావులు

చిత్రం
అన్ని పార్టీలు రాజులే  రాజకీయ చదరంగంలో  అందరూ ఒకరి పై ఒకరు గెలవాలని యావ  పాపం ప్రజలే పావులు ఎటు కదిపితే అటు పోతారు 

చికెన్ బిరియానిలు

చిత్రం
ప్రజలు  రాజకీనాయకులు పెంచే  పందెం కోళ్ళ లాంటివారు  వాళ్ళ లాభాలకు పందెం కోళ్ళు  వాళ్ళ విందులకు చికెన్ బిరియానిలు 

భలే విందు & మందు

చిత్రం
  తేనే పూసి మరీ గొంతు కోశారు  చచ్చిన కోడికి యేల సంతాపసభలు  రాజకీయ నాయకులకు భలే విందు & మందు 

కుమ్మరి పురుగుల్లా కాదు

చిత్రం
సంసారపు చికాకులు  చిటపటలాడే పోపు దినుసుల్లా ఉండాలి  బుర్రలను తొలిచే కుమ్మరి పురుగుల్లా కాదు 

నిజమైన ప్రేమ

చిత్రం
ప్రేమ  ఆకాశం లాటిది  అడగకుండానే పుడమి దాహం తీరుస్తుంది  ప్రేమ  పున్నమి చంద్రుడు లాటిది  తన స్పర్శతో కలువభామను పులకరింప చేస్తుంది  ప్రేమ  ఒక పక్షి లాటిది  అందమైన రంగుల పొదరిల్లు కడుతుంది తన ప్రేమను చూప  అడగకుండానే అన్ని చేసిది అన్ని చూసేది ప్రేమ నిజమైన ప్రేమ 

పాపం ! చిరంజీవి !!

చిత్రం
పాపం !  చిరంజీవి !! ఎక్కిన పడవ బొక్కలుపడే  పారేసిన తెప్ప పనికిరాకుండా  పోయే   ఊగిసలాట బతుకయ్యే  నడి సంద్రములో

కీర్తి బావుటాల

చిత్రం
చచ్చేదానికి  పుట్టడం ఎందుకు  పుట్టిన దానికి  ఫలితం ఏడ్వటం కాదు  కీర్తి బావుటాల ఎగురవేయడం 

చక్కగా ఒదిగి పొమ్మని

చిత్రం
ఒదిగి  ఉండమంటే  పాతాళం లోకి  తల వంచటం కాదు  చక్కటి వజ్రంలా  నిక్కచ్చి ధృడ చిత్తంతో   కల్మష రహితంగా ఉండి  ఎందులోనైనా  చక్కగా  ఒదిగి పొమ్మని 

తర్తూరు శ్రీ రంగనాథ

చిత్రం
ఎన్నెల్లు  కురిపించే  ఎంతా  చక్కని నవ్వు ముత్యాలు  మెరిపించే   నా కంటి  కొనకలలోన ......  అలోకగా నీవు  ఆది శేషుపై పవళించి  చిరునగవులతోటి పలకరించేవు  ఇన్ని నాళ్ళకు నీకు దయ కలిగేనా తండ్రి  నిను పొగడ నాకు లేవు వేల వేల నోళ్ళు  తర్తూరు శ్రీ రంగనాథ , శ్రీ దేవి  భూదేవి సమేతా