విశ్వంభర
విశ్వంభర విశ్వంభర వీణా తంత్రుల పై, కాలమనే గీతాన్ని ఆలపించాను… దిగ్దిగంతములు ఓంకార నాదాలతో నిండెలా… భువనమోహన వేణువు పై, వేదనాద స్వరాలు వినిపించాను… ఈ విశ్వమంతా సమ్మోహనాస్త్రాలై కమ్ముకొనెలా… కడలి ఒడిని ఒడిసిపట్టి, అంతరంగ తరంగాల చీకట్లు చిలికి చిలికి, విరజిమ్మాను ఈ భువనమంతా రత్నగర్భ రాసులని… అరుణగిరి సువర్ణరేఖల అంచులపై, సప్తాశ్వముల స్వర్ణరథం గూర్చి, వీనిలాకాశమంత బంగారు కిరణాలతో నింపాను… చంద్రచారికలను చేరి, నిశ్శబ్ద నిశీథులను చీల్చి , చందనామృతాలు పంచాను లోకమంతా… భువనైక మోహనమై, సకల చరాచరుల ప్రాణమై… ఉచ్శ్వాస నిశ్వాసల జీవమై… జ్ఞానానంద పరంజ్యోతి మయమై… వెలుగొందు వేల్పునేను - ఎం. మురళీ మోహన్