సహజం
సహజం
అనంత విశ్వంలో
పరమాణువంత నేనైనప్పటికీ,
‘నేను’ అనే భావం నన్ను వదలదు;
నా చుట్టూ ఉన్న ప్రతి జీవిలో,
నా సమాజంలోని ప్రతి అణువులోనూ
అదే స్థితి ప్రతిబింబిస్తోంది.
కోటానుకోట్ల సూర్యమండలాల మధ్య
మన సూర్యమండలం ఎంత చిన్నదైనా,
తన ఉనికిని తాను చాటుకున్నట్లుగా.
‘నేను’ అనేది అహం కాదు —
ఆ ‘నేను’లో ‘నీవు’ ఉన్నావని
నీ ఉనికిని గుర్తించిన క్షణంలో
అహంకారానికి తావుండదు;
అది తన ఉనికిని చాటుకోవడం —
ప్రతి పరమాణువుకూ అదే సహజసిద్ధం,
లేకపోతే ఈ విశ్వంలో తాను ఉన్నదని తెలిసేదెలా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి