🌸 చిన్ని కృష్ణుడు 🌸
యెమి యెరుగని ఆకాశములా,
ఎంత అమాయకంగా ఉన్నాడే చిన్ని కృష్ణుడు!
ఇతడేనా! శకటాది రాక్షసులను చంపినవాడు?
ఇతడేనా! గోవర్ధన గిరి ఎత్తినవాడు?
ఇతడేనా! కాలింగుడి మదము అణిచినవాడు?
వెన్న దొంగ అనుకున్నానే,
గోవుల మందలు కాచేవాడు అనుకున్నానే...!
బుడి బుడి అడుగుల యశోదా బుజ్జిగాడు అనుకున్నానే...!!
అందుకేనేమో —
నీలి ఆకాశంలా నీలి వర్ణంతో ఒకసారి —
కారుమబ్బులు కమ్మి, వురుములు, మెరుపులతో నిండిన ఆకాశంలా మరొసారి —
ఓ కృష్ణా! జగత్ రక్షకా, జనార్ధనా!
నీవే ఈ అనంత సృష్టి అని యెరుగనందుకు,
క్షమించు స్వామీ!
ఇదే నీకు వందనం. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి