పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

విశ్వంభర

చిత్రం
విశ్వంభర విశ్వంభర వీణా తంత్రుల  పై, కాలమనే గీతాన్ని ఆలపించాను… దిగ్దిగంతములు ఓంకార నాదాలతో నిండెలా… భువనమోహన వేణువు పై, వేదనాద స్వరాలు వినిపించాను… ఈ విశ్వమంతా సమ్మోహనాస్త్రాలై కమ్ముకొనెలా… కడలి ఒడిని  ఒడిసిపట్టి, అంతరంగ తరంగాల చీకట్లు చిలికి చిలికి, విరజిమ్మాను ఈ భువనమంతా రత్నగర్భ రాసులని… అరుణగిరి సువర్ణరేఖల అంచులపై,  సప్తాశ్వముల స్వర్ణరథం గూర్చి, వీనిలాకాశమంత బంగారు కిరణాలతో నింపాను… చంద్రచారికలను చేరి, నిశ్శబ్ద నిశీథులను  చీల్చి , చందనామృతాలు పంచాను లోకమంతా… భువనైక మోహనమై, సకల చరాచరుల   ప్రాణమై… ఉచ్శ్వాస  నిశ్వాసల జీవమై… జ్ఞానానంద  పరంజ్యోతి మయమై…  వెలుగొందు వేల్పునేను                                                    - ఎం. మురళీ మోహన్

జీవితం ఒక తులా త్రాసు

చిత్రం
జీవితం ఒక తులా త్రాసు జీవితం ఒక తులా త్రాసు; బాధ్యతలు  బరువులు  అందరూ సమంగా మోసినప్పుడే అందరి జీవితం సుఖమయం అవుతుంది . బరువు కానంత వరకు సుఖమయమే  జీవితం. బరువు అయిన మరుక్షణం — బ్రతుకు చాలా భారమవుతుంది, బరువు అవుతుంది                                                --------ఎం.మురళీ మోహన్ 

వారసత్వం

చిత్రం
వారసత్వం వారసత్వం అంటే ఏమీ లేదు — నీ తర్వాతి తరాలు నిన్ను, నీ పూర్వీకులను తీర్పు చేయటానికి వెతికే ఒక కారణం మాత్రమే. నీవు ఆస్తి ఇస్తే — “సరిపోలేదు” అంటారు. ఇవ్వకపోతే — “సంపాదించలేకపోయాడు” అంటారు. సంపాదించి పెట్టినా చాలని అనిపించదు; సంపాదించకపోయినా లోపమే అంటారు. ఇస్తే ప్రశ్న, ఇవ్వకపోతే మరింత ప్రశ్న — తరాల తీర్పుకు అంతం ఉండదు. అందుకే — వారసత్వం లేదని చింత వద్దు. చింతలేని ,తర తరాలు తిట్ట లేని జీవితం — ముద్దు.                                                     — murali mohan m