పరమేశ్వరా !
ఎదుట ఉన్నా —
కనలేని కన్నులు,
పిలుస్తున్నా —
వినలేని చెవులు.
సాక్షాత్
ముందు నిలబడి ఉన్నా —
కైమోడ్చి మోకరిల్లలేని మూఢత్వం .
నీవు
కనుమరుగైతే —
నీ కోసం,
నీ అడుగు జాడల కోసం
నలుదిశలా
వెతికే అమాయకత్వం నిన్నే నిందించే మూర్ఖత్వం .
శల్య పరీక్షలు తట్టుకునే
కాళహస్తి తిన్నడు ని కాను,
మామూలు మనిషిని నేను,
ఆకలి దప్పులతో అలమటించే సాధారణ జీవిని నేను.
ఎవరయ్యా నేను?
నీకు నేను ఏమౌతాను అని
కైలాసం వీడి నా కోసం కదలి వచ్చావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి