పార్వతీ పతి పరమేశ్వరాయ
పన్నగాభరణ మహేశ్వరాయ
చంద్రచూడ గంగాజటాధరాయ
రుద్రాక్షధర వ్యాఘ్రచర్మాంబరాయ
త్రినేత్రలోచన త్రిశూలహస్తాయ
హర హర శంభో సదాశివాయ
పార్వతీ పతి పరమేశ్వరాయ
పన్నగాభరణ మహేశ్వరాయ
చంద్రచూడ గంగాజటాధరాయ
రుద్రాక్షధర వ్యాఘ్రచర్మాంబరాయ
త్రినేత్రలోచన త్రిశూలహస్తాయ
హర హర శంభో సదాశివాయ
ఆకాశం నీ హద్దు అయితే —
అందనంత ఎత్తుకు ఎదుగుతావు
సముద్రమే నీ స్వప్న సీమ అయితే —
అంతులేని ధనసంపద పొందుతావు
మనసే ఓ చిలుక అయితే...
పంజరమే జీవితం అవుతుంది...
ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది...
💫
మనసే మమతల కొలువైతే...
ఇల్లే భోలోక స్వర్గం అవుతుంది...
ఆనందాల హరివిల్లుగా మారుతుంది...
📿
– M. మురళి మోహన్
జీవిత రహస్యం
— మురళీ మోహన్
కాలం కదలిపోతున్నా,
అందుకోవాలనే ఆశతో పరుగులు పెట్టాలి.
అందిన దానితో ఆగిపోకుండా — ముందు ముందుకు సాగాలి,
వెనక్కు తిరిగి చూడకుండా — ముందుకే అడుగులు సాగాలి.
అదే జీవితం.
అన్వేషణ ఫలితాలే — అనుభవిస్తున్న సౌఖ్యాలు,
చింతలకే ముడుచుకుంటే — ఆవిష్కరణలకు తావేది?
గంగాజరి ప్రవాహంలా — నీతోనే ఆగిపోదు ఈ జీవిత చిత్రం,
అనంత విశ్వంలా — నీతోనే మొదలుకాదు ఈ సృష్టి రహస్యం.
ఇది తెలుసుకున్న నాడు - యుగ పురుషుడు అవుతాడు
ఇది తెలియలేని నాడు - గొప్ప వేదాంతం పలుకుతాడు