27, ఆగస్టు 2020, గురువారం

జనం జాగృతమై ఉన్నారు



నేను చూస్తున్నా

ఈ రాజకీయ చక్రంలో

ఇరుకైనా మనస్తత్వాలతో

ఇరుసుల మధ్య తిరిగే పార్టీలను

స్వార్థాల నడుమ సాగే రాజకీయాలలో 

స్వచ్చ్చమైన స్వేఛ్చా వాయువులకు తావెక్కడ

ఎవరి గొంతులోను కనిపించని  వినిపించని  నిజాయితీ

అన్ని గొంతుల వెనక ఏవేవో గూడార్థాలే  రహస్య లెక్కల పట్టికెలే

అందుకే నమ్మలేక పోతున్నారు విశ్వసనీయత ఉంచలేక పోతున్నారు

జనం జాగృతమై ఉన్నారు కనిపించని నివురులా - తగ్గించుకోండి దుర్భాషలను,దుష్కృత్యాలనూ 

25, ఆగస్టు 2020, మంగళవారం

మార్చుకోవాలి


అలా  వెళితే

అక్కడే ఉంటుంది  పాత జ్ఞాపకాల కుటీరం

చాలా మందిని చూశాను

ఎక్కవగా అందులోనే జీవిస్తూ ఉంటారు

చుట్టూ జరిగే , జరుగుతున్నా వేవి తమకు పట్టనట్లుగా

తామేమి సాధువులు, సన్యాసులు కారు - కావలి అని కూడా  అనుకోరు

మరి యెందుకు గతం తో నే తమ తమ జీవితాలను ముడి వేసుకొని ఉంటారు

మార్పును చూస్తే భయం - తమను చుట్టూ గీసుకున్న ఇజంలోనుంచి బయటికి రాలేక

తమను తాము ప్రహించే నదిలా మార్చుకున్న రోజు - పాత జ్ఞాపకాల పొరలను చీల్చుకొని ముందుకు సాగుతారు  

స్ప్లిట్ పర్సనాలిటి

స్ప్లిట్  పర్సనాలిటి 

ఎలా ఉందో  చూడు - ఈ నీలా  ఆకాశం 

ఏమి ఎరగనట్లు - ఏంతో  అమాయకంగా 

తనేనా - నిన్న రాత్రి  భీతి గొలిపింది ఉరుముల మెరుపులతో

తనేనా - అంతటి అల్లకల్లోలం సృష్టించింది సుడిగాలి జడివానలతో

 ప్రకృతి లోనే వుంది వికృతి - మనిషిలోని స్ప్లిట్  పర్సనాలిటి తత్త్వం 

అధిగమించిన వాడు నిర్మలాకాసం  లేదా కల్లోల మనస్కుడై పోతాడు