Rolling Thoughts
20, ఏప్రిల్ 2014, ఆదివారం
ప్రశాంతంగా
రేపు అనేది ఉండగా
ఎందుకు చింత నీకు దండగ
రానీ వయస్సు
కరగనీ కాలం పోయేది ఏముంది
ఉభయ సంధ్యల నడుమ
నలిగిపోతుంది దేహం శ్రమతో
రాత్రి అనే దుప్పటి కప్పి పోనీయి నిదుర ప్రశాంతంగా
15, ఏప్రిల్ 2014, మంగళవారం
భీష్ముని పాత్ర
జీవిత
చదరంగలో
ప్రతివారు
తమ జీవితంలో
ఎప్పుడో ఒక్కప్పుడు
భీష్ముని పాత్ర వేయవలసిందే
మన మన్మోహన్ సింగు ఒక లెక్క కాదు
7, ఏప్రిల్ 2014, సోమవారం
సీతారామ కళ్యాణం
ఆకాశం రాముడైతే
కాదా సీతమ్మ భూదేవి
సూరీడే నుదిటి కుంకుమ బొట్టైతే
కాదా చందమామ సిరివెన్నెలలొకె నగు మోము
నడిరేయీ పరుచుకున్న కురులైతే
కరి మబ్బులు అలరారలేదా ముంగురులై
తారల పూలను సిగలో తురిమి
పున్నమి వెన్నలలు యెదలో పొదిగి
పాలపుంతల పై నడిచి వచ్చే వధువు సీతమ్మ - వరుని రామునికై
చూతము రండి సీతారామ కళ్యాణం కన్నుల నిండుగా మనసుల మెండుగా
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)