17, జనవరి 2014, శుక్రవారం

కుమ్మరి పురుగుల్లా కాదు



సంసారపు చికాకులు 

చిటపటలాడే పోపు దినుసుల్లా ఉండాలి 

బుర్రలను తొలిచే కుమ్మరి పురుగుల్లా కాదు 

7, జనవరి 2014, మంగళవారం

నిజమైన ప్రేమ



ప్రేమ 

ఆకాశం లాటిది 

అడగకుండానే పుడమి దాహం తీరుస్తుంది 

ప్రేమ 

పున్నమి చంద్రుడు లాటిది 

తన స్పర్శతో కలువభామను పులకరింప చేస్తుంది 

ప్రేమ 

ఒక పక్షి లాటిది 

అందమైన రంగుల పొదరిల్లు కడుతుంది తన ప్రేమను చూప 

అడగకుండానే అన్ని చేసిది అన్ని చూసేది ప్రేమ నిజమైన ప్రేమ 

4, జనవరి 2014, శనివారం

పాపం ! చిరంజీవి !!



పాపం ! చిరంజీవి !!

ఎక్కిన పడవ బొక్కలుపడే 

పారేసిన తెప్ప పనికిరాకుండా  పోయే 

 ఊగిసలాట బతుకయ్యే నడి సంద్రములో

3, జనవరి 2014, శుక్రవారం

కీర్తి బావుటాల



చచ్చేదానికి 

పుట్టడం ఎందుకు 

పుట్టిన దానికి 

ఫలితం ఏడ్వటం కాదు 

కీర్తి బావుటాల ఎగురవేయడం 

2, జనవరి 2014, గురువారం

చక్కగా ఒదిగి పొమ్మని



ఒదిగి 

ఉండమంటే 

పాతాళం లోకి 

తల వంచటం కాదు 

చక్కటి వజ్రంలా 

నిక్కచ్చి ధృడ చిత్తంతో  

కల్మష రహితంగా ఉండి 

ఎందులోనైనా చక్కగా ఒదిగి పొమ్మని 

1, జనవరి 2014, బుధవారం

తర్తూరు శ్రీ రంగనాథ




ఎన్నెల్లు  కురిపించే 

ఎంతా  చక్కని నవ్వు

ముత్యాలు  మెరిపించే  


నా కంటి  కొనకలలోన ...... 

అలోకగా నీవు 


ఆది శేషుపై పవళించి 


చిరునగవులతోటి పలకరించేవు 


ఇన్ని నాళ్ళకు నీకు దయ కలిగేనా తండ్రి 

నిను పొగడ నాకు లేవు వేల వేల నోళ్ళు 


తర్తూరు శ్రీ రంగనాథ , శ్రీ దేవి  భూదేవి సమేతా