30, నవంబర్ 2013, శనివారం

నిజమైన వీరుడు


నీ ముందు కాలం 

నీ వెనుకాల జ్ఞాపకం 

జ్ఞాపకాల సుడిలో పడి 

అందుకోలేకున్నావు  కాలాన్ని 

కాలాన్ని అందుకున్నవాడే నిజమైన వీరుడు 

28, నవంబర్ 2013, గురువారం

రాజధానెక్కడా



గాలం 

రాజకీయనాయకులు 

వేసినంత సులువుగా ఒడుపుగా 

చేపలు పట్టే వారు కూడా వెయ్యలేరు 

సీమాంధ్ర - రాయల తెలంగాణా - రాజధానెక్కడా  ( ఎక్కడు )

27, నవంబర్ 2013, బుధవారం

జగద్గురువు



భగవంతునే 

పరీక్ష చేసే కాలంలో 

జగద్గురువులకు ఉండదా పరీక్షా 

గెలిచి నిలిచిన వారు జగద్గురువులవుతారు  - మీ లా 

26, నవంబర్ 2013, మంగళవారం

మడత పేచీలు


మడత నాలుకలు  

రాజకీయ నాయకులవి  

అన్ని మడత పేచీలు తప్ప 

ఏది మాట్లాడినా స్పష్టత రావటం లేదు 


లెహర్ - ఫైలిన్


వద్దంటే ఎలా 

మీరు నేర్పిన విద్య 


తెలంగాణ - సీమాంద్ర పేరుతో 


మీరూ ఆవేశంతో గందరగోళం సృష్టిస్తున్నారు   


మేము ఆందోళనలో భాగంగా తుఫాన్లు సృష్టిస్తాం  


                                                    - లెహర్ - ఫైలిన్ 

25, నవంబర్ 2013, సోమవారం

పడివుంటారు



పరిష్కారం 

చూపితే మళ్ళి రారు 


చూపక పొతే మొదటికే మోసం 


నాన్చితే సరి 
పడివుంటారు కాళ్ళ వద్దే 

24, నవంబర్ 2013, ఆదివారం

మన పిచ్చి కాకపొతే



పిచ్చి వాడిని

తెచ్చి , తన మెడకో


బంగారు పతకం వేసి , గౌరవించినా


నిలుపుకోనునా ,తన గౌరవం  - మన పిచ్చి కాకపొతే